Read News in Telugu Language
adsdaksha

మేమున్నాం..జపాన్లో ఇండియన్స్ కోసం కంట్రోల్ రూం ..

దక్ష న్యూస్, ఇంటర్ నెట్ డెస్క్: జనవరి 1

జపాన్లోని భారతీయ పౌరుల కోసం ఇండియ ఎంబసీ ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. జపాన్ లోని భారతీయులకు సాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. జపాన్ లోని భారతీయులు సహాయం కోసం ఈ క్రింది ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

sscons.tokyo@mea.gov.in offseco.
tokyo@mea.gov.in

సోమవారం ( జనవరి 1 2024)న మధ్య జపాన్ వరుస భూకంపాలతో అతలాకుతలం అయింది. కేవలం 90 నిమిషాల వ్యవధిలో 21 భూప్రకంపనలు సంభవించాయి. అన్ని భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో నమోదు అయ్యాయి. వీటిలో రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రత తో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ నేపధ్యంలో

భారతీయులు సహాయం కోసం +81-80-3214-4734 (225 25 బార్న్ వాల్)
+81-80-6229-5382 ( 25 25 భట్టాచార్య)
+81-80-3214-4722 ( 25 235 రాఖీ )
నంబర్లలో సంప్రదించాలని జపాన్ లోని భారత రాయబార కార్యాలయం కోరింది.

Hospital

read also : ఆ 13 యాప్‌లను తొలగించండి.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్ సూచన ..

జపాన్ లో నూతన సంవత్సర ప్రారంభంలో సునామీ.. ఆందోళనలో ప్రజలు..

జపాన్ దేశ ప్రజలకి నూతన సంవత్సరం భయాందోళనల మధ్య మొదలయ్యింది. జపాన్ లో రిక్టార్ స్కేల్ పై 7.6 తీవ్రత తో కంపించిన భూమి చివరికి సునామీకి దారి తీసింది. ఇప్పటికే ఇషికావా ప్రాంతంలోని వాజీమా పోర్టుకు సునామీ అలలు తాకటంతో ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. 1.2 మీటర్ల ఎత్తులో ఈ అలలు ఎగసిపడినట్లు జపాన్ వాతావరణం శాఖ వెల్లడించింది.

read also : Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం..

రానున్న సునామీ అలలు 5 మీటర్ల ఎత్తులో ఎగసిపడి తీరాన్ని తాకే అవకాశం ఉందని ముందొస్తుగా తీర ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.