Read News in Telugu Language
adsdaksha

రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఏజ్ లిమిట్ 46 ఏళ్లకు పెంచిన సర్కార్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 12

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇతర ఉద్యోగాలకు వయోపరిమితి ( employee age limit ) ని మరో రెండేళ్లు పెంచుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. జనరల్ కేటగిరీలో వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015లో వయోపరిమితి పెంచారు. నిరుద్యోగ యువత, టీఎస్పీఎస్సీ వినతి మేరకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచినట్లు జీవోలో సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.

Hospital

read also : సిసోడియాకు బెయిల్ .. ఆప్ సీనియర్ నేతకు స్వల్ప ఊరట..

దాదాపు పదేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక వచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను భర్తీ చేయలేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడింది. ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రెండు సంవత్సరాల పాటు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల వయోపరిమితి దాటిపోయి నిరాశలో కూరుకుపోయిన నిరుద్యోగులకు ఈ నిర్ణయం భారీ ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఈ వయోపరిమితి నిర్ణయాన్ని యూనిఫామ్ సర్వీసులకు కాకుండా మిగతా పోస్టులకు వర్తించనుంది.

 

Leave A Reply

Your email address will not be published.