Read News in Telugu Language
adsdaksha

చిందేసిన మంత్రి .. భోనమెత్తి మహిళలతో నృత్యాలు..

తండాబాట‌లో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు..

కాంగ్రెస్ ని ఖ‌తం చేయండి .. బిజెపిని బొంద పెట్టండి..

ఆ రెండు పార్టీల వ‌ల్లే దేశం, రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం ..

– మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు..

కాంగ్రెస్ ( congress ) ని ఖ‌తం చేయండి .. బిజెపి ( bjp ) ని బొంద పెట్టండి ఆ రెండు పార్టీల వ‌ల్లే దేశం, రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అయిందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ‌ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ( errabelli dayakar rao )  ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఆదివారం పాల‌కుర్తి ( palakurthi ) నియోజ‌క‌వ‌ర్గంలో తండా బాట కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన మంత్రి, పాల‌కుర్తి మండ‌లంలోని హ‌ట్యాతండా, భీక్యా నాయ‌క్ పెద్ద తండా, టిఎస్ కె తండా, పెద్ద తండా (కొండాపురం) ల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయా తండాల్లో మంత్రి నూత‌న పంచాయ‌తీ భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న చేశారు. ప‌లు సిసి రోడ్ల‌కు మంత్రి శంకుస్థాప‌న చేశారు.

Hospital

read also : Realme C53 : కొత్త ఫోన్ కొనాలనుకుంటుంన్నారా.. రియల్‌మి ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 2,550 లకే ..

ఈ సంద‌ర్భంగా ఆయా తండాల స‌ర్పంచ్ ల అధ్య‌క్ష‌త‌న, తండాల వార్డు స‌భ్యులు, నాయ‌కులు, ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో జ‌రిగిన స‌భ‌ల‌లో మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ఇవ్వాళ్టి ఈ క‌ష్టాల‌కు కార‌ణ‌మే ఆ రెండు పార్టీలే అన్నారు.

కెసిఆర్ ( kcr ) వ‌చ్చాకే తెలంగాణ ( telangana ) సస్య‌శ్యామ‌లం అయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉన్నారని, అనేక సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల అమ‌లుతో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెరిగాయన్నారు. భూములకు విలువ‌లు వ‌చ్చాయని, రైతులు బాగుప‌డ్డారన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్, బిజేపి పార్టీల వారు గ్రామాల‌కు వ‌స్తే త‌రిమి కొట్టండన్నారు. తండాలకు వచ్చిన మంత్రికి ఆయా తండాల ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. బ‌తుక‌మ్మ‌లు, కోలాట నృత్యాలు, డ‌ప్పు వాయిద్యాలు, పూలు చ‌ల్లుతూ, తిల‌కం దిద్దుతూ స్వాగ‌తించారు. ఈ సంద‌ర్భంగా టిఎస్‌కె తండాలో లంబాడా మ‌హిళ‌ల కోరిక మేర‌కు మంత్రి బోన‌మెత్తి, వారితో క‌లిసి వారి సంప్ర‌దాయ లంబాడా నృత్యాన్ని చేశారు. కార్య‌క్రమాల్లో జిల్లా పంచాయ‌తీ అధికారి, ఆయా తండాల ప్ర‌జ‌లు, స్థానిక‌ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

read also : రాష్ట్రం ఏర్పడ్డాకే అభివృద్ధి సంక్షేమ పధకాలు.. మంత్రి కొప్పుల ఈశ్వర్..

 

Leave A Reply

Your email address will not be published.