Read News in Telugu Language
adsdaksha

మ‌హిళా లోకాన్ని చైత‌న్య ప‌ర‌చండి ..మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ..

దక్ష న్యూస్, హైద‌రాబాద్‌: సెప్టెంబ‌ర్ 14

మ‌హిళా స‌మాఖ్య‌ల ప‌దాధికారుల స‌మావేశంలో మంత్రి పిలుపు..

మ‌హిళా లోకాన్ని చైత‌న్య ప‌ర‌చండి. మ‌హిళ‌లు ఆర్థికంగా నిల‌దొక్కుకున్న‌ప్పుడే స‌మాజం బాగుప‌డుతుంది. మ‌హిళ‌ల్ని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌న సీఎం కేసిఆర్ ( cm kcr ) ప‌ని చేస్తున్నారు. ఆయ‌న‌కు అండ‌గా నిల‌వండి.. అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ( errabelli dayakar rao ) పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జిల్లాల‌ మ‌హిళా స‌మాఖ్య‌ల ప‌దాధికారుల స‌మావేశం హైద‌రాబాద్ ( hyderabad ) రాజేంద్ర న‌గ‌ర్ లోని టిఎస్ ఐఆర్ డి ( tsird ) లో గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొద‌టిసారిగా జిల్లాల సమాఖ్య‌ల ప‌దాధికారుల స‌మావేశం నిర్వ‌హిస్తున్నందుకు అభినంద‌న‌లు తెలిపారు.

read also : ఇక వైద్య రంగానికి హబ్ గా ఖమ్మం.. 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తి..

Hospital

సీఎం కేసిఆర్ వ‌చ్చాకే, రాష్ట్రంలో మ‌హిళా సంఘాలు బ‌లోపేతం అయ్యాయని మంత్రి అన్నారు. మ‌న మ‌హిళ‌లు దేశంలోని మ‌హిళలంద‌రికంటే ముందు న్నారని, దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఇంటింటికీ న‌ల్లాల ద్వారా మంచి నీరు ఇస్తున్నామన్నారు. బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న ర‌హిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. మ‌న మ‌హిళ‌లు దేశానికి పాఠాలు చెబుతున్నారని, దేశంలో ఎక్క‌డా మ‌న రాష్ట్రం త‌ర‌హా అభివృద్ధి, ఇలాంటి ప‌థ‌కాలు లేవన్నారు. ఇంత‌గా మ‌న కోసం ప‌ని చేస్తున్న సీఎం కేసిఆర్ కు అండ‌గా నిల‌వాల‌ని మంత్రి మ‌హిళ‌ల‌కు పిలుపునిచ్చారు. వారిని చైత‌న్య ప‌ర‌చాల‌ని అధికారులను కోరారు.

read also : ఓటర్ల జాబితా పై నిగ్గు తేల్చండి :

ఈ కార్యక్రమంలో….పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సెర్ఫ్ సీఈవో గౌతం, స్పెషల్ కమిషనర్ ప్రదీప్, ఎస్ బి ఎం డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, వివిధ జిల్లాల స‌మాఖ్య‌ల ప‌దాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.