Read News in Telugu Language
adsdaksha

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య‌ విప్ల‌వం.. వైద్యుల క‌ర్మాగారంగా తెలంగాణ రాష్ట్రం ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 15

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య‌ విప్ల‌వం సంభ‌విస్తున్న‌దని, వైద్యుల క‌ర్మాగారంగా తెలంగాణ ( telangana )  రాష్ట్రం ఆవిర్భ‌వించిందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ( errabelli dayakar rao ) అన్నారు. శుక్రవారం సీఎం వ‌ర్చువ‌ల్ గా ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రారంభించిన సందర్భంగా జ‌న‌గామ ( janagama ) మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ‌తంలో మెడిసిన్ ( medicine ) చ‌ద‌వాలంటే ప‌క్క రాష్ట్రాల‌కు పోయేది. డోనేష‌న్లు, ఫీజులు క‌ట్ట‌లేక ఇబ్బందులు ప‌డేది. ఆస్తులు అమ్మ‌కునేది. ఇంతా చేస్తే, మ‌న రాష్ట్రంలో కేవ‌లం 5 మెడిక‌ల్ కాలేజీలు మాత్ర‌మే ఉండేది. ఇవ్వాళ తెలంగాణ‌లోని ఒక్క వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలోనే 5 మెడిక‌ల్ కాలేజీలు ఏర్ప‌డ్డాయి. దీంతోపాటు 5 పెద్ద ద‌వాఖానాలు వ‌చ్చాయి. రాష్ట్రంలో మొత్తం 26 కాలేజీలు ఏర్ప‌డ్డాయి. తెలంగాణ రాష్ట్రం డాక్ట‌ర్ల త‌యారీ క‌ర్మాగారంగా మారుతోందన్నారు.

read also : సీఎంపిఎఫ్ సమస్యల పరిష్కారానికి సింగరేణి కృషి..

ఏడాదికి 10వేల మంది డాక్ట‌ర్ల‌ను త‌యారు చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరిందని మంత్రి అన్నారు. ఇంతేగాక‌, రాష్ట్రంలోని మెడిక‌ల్ కాలేజీల్లో 85శాతం సీట్లు స్థానికుల‌కే ల‌భించే విధంగా రాష్ట్రం నిర్ణ‌యం తీసుకుందని తెలిపారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా కేంద్రం
మెడిక‌ల్ హ‌బ్ గా మారుతున్న‌దని, ఎంజిఎం, ఎస్ఎస్‌జివై సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ కు తోడుగా కొత్త‌గా వ‌రంగ‌ల్ లో రూ.11 వందల కోట్ల‌తో అంత‌ర్జాతీయ స్థాయి సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను నిర్మిస్తున్నాం అని మంత్రి తెలిపారు. దీంతో ఇక ఎలాంటి రోగానికైనా మ‌న ద‌గ్గ‌రే ఉచితంగా అంత‌ర్జాతీయ స్థాయి వైద్యం అందుబాటులోకి వ‌స్తుంద‌ని మంత్రి వివ‌రించారు.

Hospital

read also : జర్నలిజం ముసుగులోని అసాంఘీక శక్తులపై మరో ఉద్యమం ..

దేశంలో వైద్య రంగంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో 3వ స్థానంలో జ‌న‌గామ జిల్లా ఉందని మంత్రి తెలిపారు. ఇదంతా ఇక్క‌డ బాగా ప‌ని చేస్తున్న వైద్యులు, సిబ్బంది ఘ‌న‌త‌ే అని ఇక ఇక్క‌డ జ‌న‌గామ‌లో సీట్లు వ‌చ్చిన విద్యార్థులు బాగా చ‌దువుకోవాలన్నారు. వైద్యులుగా మ‌న జిల్లాకు, రాష్ట్రానికి అంత‌ర్జాతీయ కీర్తిని తేవాలి అని మంత్రి ఎర్ర‌బెల్లి ఆకాంక్షించారు.

read also : వైద్య విద్యలో నవశకానికి నాంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజ‌య్య‌, ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిలు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ హ‌యాంలో వైద్య ప‌రంగా జ‌రిగిన‌, జరుగుతున్న అభివృద్ధిని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు వైద్యం అందుబాటులోకి వ‌చ్చింద‌ని, ఎక్క‌డిక‌క్క‌డ హాస్పిట‌ల్స్, మెడిక‌ల్ కాలేజీలు, వైద్య ప‌రిక‌రాలు, సిబ్బందిని పెంచ‌డం వ‌ల్ల‌, ప్ర‌తి స‌మ‌స్య‌కూ హైద‌రాబాద్ కుపోయే ప‌రిస్థితి పోతోంద‌న్నారు. అలాగే ప్రైవేట్ హాస్పిట‌ల్స్ దోపిడీ కూడా నిరోధించ‌బ‌డింద‌ని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.