Read News in Telugu Language
adsdaksha

పార్టీ పేరు మార్పు కలిసిరాలేదు .. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి..

దక్ష న్యూస్, వరంగల్ : ఏప్రిల్ 6

బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మారుస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( errabelli dayakar rao ) అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన రైతు దీక్ష ( raitu deksha ) లో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ( trs ) ను బీఆర్ఎస్ ( brs )  గా మార్చిన తర్వాత పెద్దగా కలిసిరాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం. పార్టీ మార్పు పట్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందన్నారు. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని చెప్పారు.

Read also: వడ్డీ రేట్లు కొనసాగింపు .. ఏడోసారి యథాతథం చేసిన ఆర్బీఐ..

Hospital

పార్టీ హైకమాండ్ కూడా బీఆర్ ఎస్ ను టీఆర్ ఎస్ గా మార్చేందుకు పనులు ప్రారంభించిందని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా దయాకర్ రావు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో తనని జైలుకు పంపించాలని కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. ఇక పార్టీ మార్పుపై స్పందించిన ఎర్రబెల్లి.. జైలుకి వెళ్లినా సరే.. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎల్లకాలం బీఆర్ ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

Read also: సింగాపురం ఇందిరను కలిసిన కడియం కావ్య.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

అయితే ఎర్రబెల్లి మాటలకు అర్థాలే వేరులే అంటూ బీఆర్ ఎస్ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. గతంలో గొంతులో ప్రాణం ఉండగా.. టీడీపీని వీడనని చెప్పిన ఎర్రబెల్లి.. టీఆర్ఎస్ లో చేరారని.. ఇప్పుడు ఆయన బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంటుండటం కొసమెరుపు.

Leave A Reply

Your email address will not be published.