Read News in Telugu Language
adsdaksha

ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్సైకి గాయాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 14

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే… ఎల్బీనగర్ ( lb nagar ) లో మంగళవారం అర్థరాత్రి జరిగిన దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఎక్సైజ్ సీఐ ( excise ci ) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ( rangareddy district ) కోర్టు సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు యూటర్న్ చేస్తూ బైక్ ను ఢీకొట్టింది. టూవిల్లర్ పై ఉన్న చార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ ( sadiq ali ) ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై ఖాజా వలీ మొయినుద్దీన్ గాయాల పాలయ్యారు. ఇద్దరూ మలక్ పేటలోని పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. అయితే నిన్న ఎల్బీనగర్ లో ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Hospital

read also : జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్ .. సత్తాచాటిన తెలుగు స్టూడెంట్స్..

రోడ్డు యాక్సిడెంట్ జరిగిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. ఇదీలా ఉండగా సీఐ సాదిక్ అలీ రెండు రోజుల క్రితం మెదక్ కు బదిలీ అయ్యారు. ఈ ప్రమాద విషయం తెలిసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.