Read News in Telugu Language
adsdaksha

ఇక ప్రభుత్వ బడుల్లో ఫేస్ రికగ్నైజ్ అటెండెన్స్ ..ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 2

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నైజేషన్  ( facial recognition ) హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అన్ని ప్రభుత్వ బడులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పారదర్శకంగా నమోదు చేసేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని తీసుకొచ్చారు.

read also : 13 నుండి అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్..

Hospital

ఇప్పటి వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మ్యానువల్‌గా తీసుకునే హాజరు విధానం ఉండేది. ప్రతి నెలాఖరులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు. అయితే వారు పంపిన వివరాలు విద్యార్థులకు అందజేస్తున్న ఆహారం, దుస్తులు, పుస్తకాలకు పొంతన ఉండడం లేదు. దీంతో పాఠశాల నిర్వహణ నిధులు కూడా పక్కాగా లెక్కించలేని పరిస్థితి నెలకొంది.

read also : 3న ప్రజా పాలన గ్రామ సభల షెడ్యూల్ ఇదే : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

ఫేస్ రికగ్నైజేషన్ హాజరు కోసం విద్యాశాఖ ప్రత్యేక యాప్‌ను సైతం రూపొందించింది. ఈ హాజరు విధానం ద్వారా విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలనేది విద్యాశాఖ ఆలోచనగా తెలుస్తోంది. దాదాపు ఏడాది క్రితమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా కనీసం 40 శాతం పాఠశాలల్లో అమలు కావడం లేదు. ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో విద్యాశాఖ ఈ అంశంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కాగా, ఈ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.