Read News in Telugu Language
adsdaksha

ఫాస్టాగ్ గడువు పెంపు.. ఈనెల 28వరకు ఈ-కేవైసీ చేసుకోవచ్చు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 3

జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లించే ఫాస్టాగ్ (FASTag) KYC అప్ డేట్ చేసే గడువును కేంద్రం పొడిగించింది. జనవరి 31 వరకు ఉన్న గడువును ఈనెల (ఫిబ్రవరి) 28 వరకు పెంచింది. వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్ తో ఫాస్టాగ్ ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రతి వాహనం వన్ ఫాస్టాగ్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క వెహికిల్ కు తప్పనిసరిగా ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ప్రకటించింది. దీనిని కేవైసీ అప్ డేట్ చేసేందుకు ఐహెచ్ఎంసీఎల్ (IHMCL) కస్టమర్ పోర్టల్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

Read also: అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోడీ కీలక ప్రకటన..

Hospital

ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) పరికరం. టోల్ ప్లాజాల వద్ద డైరెక్టుగా వాలెట్ల నుంచి లేదా లింక్ చేయబడిన బ్యాంకులనుంచి టోల్ చెల్లింపులు చేస్తుంది. ఇది టోల్ ప్లాజాలు, హైవేలపై ఆటోమేటిక్ టోల్ చెల్లింపులు అనేవి ఈజీగా అయిపోతాయి. అసలు ఫాస్టాగ్ (FASTag) లో ఈ-కేవైసీ (KYC) ఎలా చేయాలో చూద్దాం…

Read also: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కారు దిగిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య..

మొదట ఐహెచ్ఎంసీఎల్ (IHMCL) కస్టమర్ పోర్టల్ లో మై ప్రొఫైల్ (My Profile) ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో ఈకేవైసీ (KYC) పై క్లిక్ చేసి కస్టమర్ టైపు (Customer Type) ని సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లతో ఇచ్చిన ఫీల్డ్ లను నింపాలి. పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అప్ లోడ్ చేసి అడ్రస్ ప్రూఫ్ కింద అడ్రస్ వివరాలు ఎంట్రీ చేయాలి. డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత ఫాస్టాగ్ కేవైసీ (FASTag KYC) ప్రాసెస్ అనేది సక్సెస్ ఫుల్ గా అయిపోతుంది.

Leave A Reply

Your email address will not be published.