Read News in Telugu Language
adsdaksha

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు.. బాణసంచా ఫ్యాక్టరీలో 11 మంది కార్మికులు మృతి..

దక్ష న్యూస్, మధ్యప్రదేశ్‌ : పిబ్రవరి 7

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాణసంచా కంపెనీలో పేలుడు సంభవించి ఏకంగా 11 మంది మృతిచెందారు. దాదాపు 200 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని హర్ధా  ( Hardha ) నగరంలో జరిగిన ఈ ఘటనతో దేశ ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవల తరచూ బాణసంచా కంపెనీల్లో ప్రమాదాలు సంభవించడం.. పదుల సంఖ్యలో మరణించడం.. ప్రభుత్వాలు, పాలకులు షరా మాములుగానే ప్రమాదం జరిగినప్పుడు హాడావిడి చేసి తర్వాత చేతులు దులుపుకోవడం పరిపాటిగానే మారింది. ఇదిలావుంటే.. బైరగర్ పట్టణంలోని మగర్ధ రోడ్డులో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ప్యాక్టరీలో మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భారీ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, దుకాణాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇదీగాక మరికొంత మంది కర్మాగారంలో చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

Hospital

Read also: శరద్ పవార్ కు బిగ్ షాక్.. ఎన్సీపీ అజిత్ పవార్ దేనన్న ఈసీ..

ఇందౌర్‌, భోపాల్‌ నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి. మరోవైపు బాణసంచా పేలుడు ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ అధికారులను ఆరా తీశారు. అగ్నిప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు ఇందౌర్‌, భోపాల్‌లోని ఆస్పత్రులతో పాటు ఎయిమ్స్‌లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందిస్తామని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.