Read News in Telugu Language
adsdaksha

ఏపీ లోనూ ఆర్టీసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 1

అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల్లో భాగంగా అమలు చేస్తున్న అభయహస్తం ( abhaya hastham ) ఆరు గ్యారంటీల్లో ఒకటైన తెలంగాణ ( telangana ) మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ( free bus journey ) ఇప్పుడు ఏపీ ( ap ) లోను అమలు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ పథకంపై ఇప్పటికే తెలంగాణలో మిశ్రమ స్పందన రావడంతో ఈ పధకం అమలుకు ప్రభుత్వం అధికారులతో సమాలోచనలు చేస్తోంది. ఆంధ్ర లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

read also : మేమున్నాం..జపాన్లో ఇండియన్స్ కోసం కంట్రోల్ రూం ..

Hospital

ఏపీలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేస్తుండగా, అందులో 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసి ఉద్యోగుల జీతాలకు నెలకు 300 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. రోజుకు 17 కోట్లు సంపాదిస్తున్న ఆర్టీసి, ఒకవేళ ఉచిత ప్రయాణం పెడితే రోజుకు 4 కోట్లు నష్టపోనుందని ఓ అంచనా. దీనిపై ఆర్టీసీని, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

read also : ఆ 13 యాప్‌లను తొలగించండి.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్ సూచన ..

మొదటిగా ఈ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయగా, తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఈ సంక్రాంతి నుంచే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.