Read News in Telugu Language
adsdaksha

Free Tea : లారీ డ్రైవర్లకు ఫ్రీ ఛాయ్‌.. ఒడిశా ప్రభుత్వం వినూత్న నిర్ణయం..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 22

చాలావరకు రోడ్డు ప్రమాదాలకు లారీలే కారణం అవుతుంటాయి! సరకు రవాణా కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో డ్రైవర్లు నిద్రలేకుండా కష్టపడుతుంటారు. అలా నిద్రలేమితో అలసిపోయి ఉన్నా కూడా లారీ నడుపుతున్నప్పుడు.. ఒక్కసారి రెప్పవాల్చినా సరే.. ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిద్రలేమి, అలసిపోయి ఉన్న లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ ( Free Tea ) పంపిణీ చేయడం ద్వారా వారిలో నిద్రమత్తు వదిలించి ఉత్తేజ పరచాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

Read also: దివ్యాంగులను కించపరిచే పదాలు వాడొద్దు..ఈసీఐ..

Hospital

దాంతో హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలులో భాగంగా తొలుత రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లు టీ తాగిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేలా కూడా హైవేల పక్కన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Read also :  ఆధార్‌తో ఆస్తుల అనుసంధానమై, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం….

30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్‌ నిర్మిస్తున్నామని ఒడిశా అధికారులు పేర్కొన్నారు. వాటిలో నిద్రపోవడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.