Read News in Telugu Language
adsdaksha

గడప గడపకు కాంగ్రెస్ తో ప్రతీ గడపకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 7

– పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గ సమావేశం..

గడప గడపకూ కాంగ్రెస్ (gadapa gadapa ku congress ) అనే కార్యక్రమం తో పినపాక ( pinapaka )  నియోజకవర్గంలోని ప్రతీ గడపను కాంగ్రెస్ శ్రేణులు సందర్శించాలని, ఏడు మండలాలకు చెందిన అన్ని గ్రామాల్లోని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను గురించి వివరించాలని తెలంగాణ ( telangana )  ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) పేర్కొన్నారు. శనివారం పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ హస్తం పార్టీతోనే సంక్షేమం సాధ్యమమనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించాలని పిలుపునిచ్చారు.

Hospital

read also : ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ రీతు వర్మ..

నియోజకవర్గంలోని ప్రతి గడపకూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేయబోయే ఆరు గ్యారంటీల వివరాలు ఖచ్చితంగా తెలియజేయాలన్నారు. నియోజకవర్గ అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ముఖ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించి భవిష్యత్తులో మంచి గుర్తింపును ఇస్తుందని ఇందుకు తాను భరోసాగా ఉంటానని నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్, పార్టీ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.