Read News in Telugu Language
adsdaksha

బోగస్ ఓట్లకు కేరాఫ్ పువ్వాడ .. మువ్వా సంచలన వ్యాఖ్యలు..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 11

42వ డివిజన్, రాంక్యా తండాలో గడప గడపకు కాంగ్రెస్..

బోగస్ ఓట్లకు కేరాఫ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని కాంగ్రెస్ ( congress) మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు ( muvva vijay babu ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ( khammam ) నగరంలోని 42వ డివిజన్, రఘునాథపాలెం మండలం రాంక్యా తండాలో గడప గడపకు కాంగ్రెస్ ( gadapa gadapa ku congress ) కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపకు గడపకు మువ్వా తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

read also : గోత్రం లోను సైన్స్ ఉంది.. అదేంటో తెలుసుకోండి..

Hospital

రెండు పర్యాయాలు దొంగ ఓట్లతోనే పువ్వాడ ఎమ్మెల్యేగా గెలిచారని మువ్వా ఆరోపించారు. మూడవ సారి అదేవిధంగా గెలవాలని చూస్తున్న పువ్వాడ గెలుపును ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు పువ్వాడ అజయ్ కుమార్ దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేడో రేపో ఓటర్ల సమగ్ర జాబితా రానుందని వాటి వివరాలు పూర్తిగా పరిశీలిస్తామని అయినప్పటికీ పువ్వాడకు చెందిన దొంగ ఓట్లు ఉన్నట్లు ఆ జాబితాలో తేలితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

read also : 14 న ప్రెస్ టూర్ ..

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మలీదు జగన్, ఎం.డీ. ముస్తాఫా, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, దుంపల రవి కుమార్, బోడా శ్రావణ్ కుమార్, చింతమళ్ల గురుమూర్తి, కీసర పద్మజా రెడ్డి, శ్రీ కళా రెడ్డి, నరసింహారావు, కాంపాటి వెంకన్న, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.