Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి.. తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 1

– కార్యకర్తల్లో జోష్ నింపిన గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం

తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఇదే మనందరి లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఇల్లందు ( yellandu ) లో గడప గడపకు కాంగ్రెస్ ( gadapa gadapaku congress )  ప్రచార కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య ( koram kanakaiah ) తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.

Hospital

read also : గుండెనిండింది.. మనసు పొంగింది..పొంగులేటి నిలయం లో రక్షాబంధన్ వేడుకలు..

తెలంగాణ ( telangana ) లోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు సహకరించాలని తమ వద్ద ఉన్న ఓటు అనే ఆయుధంతో అవినీతి పరులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.