Read News in Telugu Language
adsdaksha

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 4

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ( gadwal mla dk aruna ) ఎన్నిక వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని సోమవారం తెలంగాణ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ( bandla krishnamohan reddy ) పై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయనపై వేటు వేసింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 ఆగస్టు 24న హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేడు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, గద్వాల నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేసింది.

Hospital

read also : భవిష్యత్ తరాలకు సాహిత్య మాధుర్యాన్ని అందజేయాలి..

ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి గెజిట్ లో ప్రచురించాలని లేఖలో పేర్కొంది. తెలంగాణ సీఈఓ రాసిన లేఖతో హైకోర్టు తీర్పు కాపీని జతపరిచింది. ఈ మేరకు తెలంగాణ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 2004 నుంచి 2018 వరకు గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పాలమూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రకటించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై న్యాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. దీంతో డీకే అరుణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.