Read News in Telugu Language
adsdaksha

విద్యార్థులకు సదవకాశం..

గాంధీ చిత్రాన్ని ఫ్రీగా తిలకించండి..

– ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్..

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమాల పై నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచితంగా చూపించడం జరుగుతుందని ఖమ్మం ( khammam )  జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( district collector  v.p. gautham ) అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా నేటి నుండి ఈ నెల 24 వరకు జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు గాంధీ సినిమా ( Gandhi movie) ను విద్యార్థులకు ఉచితంగా చూపించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టర్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి నగరంలోని ఏషియన్ సాయిరాం, తిరుమల 70ఎంఎం థియేటర్లలో గాంధీ సినిమాను తిలకించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులకు కల్పించిన రవాణా సౌకర్యం, తదితరాలను పరిశీలించారు. జిల్లాలోని మొత్తం 17 థియేటర్లలో ఉదయం 10 గంటల నుండి గాంధీ సినిమా ఒక షో ను విద్యార్థులకు చూపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఖమ్మం ( khammam)  నగరంలో 6, సత్తుపల్లి ( sattupalli) లో 2, మధిర ( madhira) లో 2, బోనకల్ ( bonakal) , ఏన్కూరు (yenkuru ) , తల్లాడ. (Thallada), వైరా ( wyra) , కల్లూరు ( Kalluru), నేలకొండపల్లి (nelakomdapalli), సింగరేణి ( singareni)  లలో ఒక్కో థియేటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. మనం ఎన్ని పాఠాలు చదివినా, పరీక్షలు రాసిన స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన సంఘటనలు, సన్నివేశాలు గాంధీ లాంటి సినిమా చూడటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలోని విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ గాంధీ సినిమా చూడాలని కలెక్టర్ కోరారు.

Hospital

Read also : మై ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ దాతృత్వం..

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఖమ్మం ఆర్డీవో గుంటుపల్లి గణేష్, ఎసిపిలు పివి. గణేష్, ప్రసన్న కుమార్, విద్యాశాఖ సీఎంఓ రాజశేఖర్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read also : జిల్లా లోని 14 థియేటర్ ల లో గాంధీ చిత్రం..

Leave A Reply

Your email address will not be published.