Read News in Telugu Language
adsdaksha

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు.. 23న ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 20

జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 23న జర్మన్ భాషా శిక్షణ, ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌ పవర్ కంపెనీ లిమిటెడ్ (తెలంగాణ ప్రభుత్వ సంస్థ) ( tomcom )  ఒక ప్రకటనలో తెలిపింది. ట్రిపుల్ విన్ భాగస్వామ్యంలో భాగంగా జర్మనీ (germany ) లో రిక్రూట్ అయ్యే నర్సుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
GNM/B.Sc. విద్యార్హత కలిగిన 21-38 సంవత్సరాల వయస్సులోపు తెలంగాణలోని గుర్తింపు పొందిన కళాశాలల నుండి నర్సింగ్, ఐసియు, జెరియాట్రిక్స్ / ఆర్థోపెడిక్స్ / సైకియాట్రీ / కార్డియాలజీ / నియోనాటల్ / సర్జికల్ వార్డు మొదలైనవాటిలో కనీసం 1-3 సంవత్సరాల ప్రొఫెషనల్ / క్లినికల్ వర్క్ అనుభవం ఉండి, జర్మన్ భాషా నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Hospital

read also : తుమ్మలపై దాడి కేసులో నిజాలను నిగ్గు తేల్చాలి.. ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ..

ఎంపికైన అభ్యర్థులు తమ B1 భాషా శిక్షణను భారతదేశంలో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పని చేసే అవకాశం ఉంటుందని, జర్మనీలో B2 గుర్తింపు పరీక్షను పూర్తి చేసిన తర్వాత రిజిస్టర్డ్ నర్సుగా ప్రమోట్ చేయబడతారని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగ అభ్యర్ధులకు కనీస జీతం 2300-2800 యూరోలు (ఓవర్‌టైమ్ అలవెన్సులు మినహా) చెల్లిస్తారని పేర్కొన్నారు. ఉచిత శిక్షణ, జర్మన్ భాషా పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా చెల్లించబడుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. TOMCOM , జర్మన్ భాగస్వాముల ద్వారా అన్ని వీసా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ, వన్ వే విమాన టిక్కెట్‌లు ఉచితంగా అందించబడతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్‌రోల్‌మెంట్ గురించిన మరిన్ని వివరాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు 9908830438 /8919047600 /7032379066 నంబర్‌లను సంప్రదించి అదనపు సమాచారం కోసం, www.tomcom.telangana.gov.in, TOMCOM మొబైల్ యాప్‌ని సందర్శించాలని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.