Read News in Telugu Language
adsdaksha

దేశాభివృద్ధికి యువత ప్రయత్నాలను ప్రోత్సహించాలి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 12

గీతంలో జాతీయ యువజన దినోత్సవం..

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద యువతి యువకుల ప్రతిజ్ఞ..

దేశాభివృద్ధికి యువత ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని వక్తలు పేర్కొన్నారు. యువతకు మార్గ నిర్దేశంగా పనిచేయడం ద్వారా వారి ఉన్నతికి తోడ్పాటు అందించాలన్నారు. పటాన్చెరువు మండలం రుద్రవరం గ్రామపంచాయతీ పరిధిలోని గీతం కళాశాల ( gitam college ) లో శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం విద్యార్థి విభాగం చొరవతో పాటు స్టూడెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద ఆలోచనలు తత్వశాస్త్రంతో యువతను ప్రేమించడం యువతకు మార్గ నిర్దేశక శక్తిగా పనిచేయడం దేశాభివృద్ధికి వారి ప్రయత్నాలు ప్రోత్సహించడం ఈ వేడుక లక్ష్యంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ భావనను పునరావిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేసి యువతి యువకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గీతం కళాశాల రెసిడెన్ట్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వర్మ సమన్వయకర్తలు డాక్టర్ సి వి నాగేంద్ర కుమార్ అజయ్ లతోపాటు స్టూడెంట్ లెఫ్ట్ అధికారి జియో పోడిపోరా, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

read also : ఖమ్మం లో మార్కెటింగ్ శాఖా మంత్రి విస్తృత పర్యటన..

Hospital

ఆధునిక భారతదేశన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భారత ప్రభుత్వం దీనిని 1984లో అధికారికంగా ప్రకటించి మరుసటి ఏడది నుంచి స్వామి వివేకానంద బోధనలు తత్వశాస్త్రంతో యువతను ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా దీనిని నిర్వహిస్తున్నారు.

జాతి నిర్మాతలను రూపొందించడంపై కార్యాశాల
గీతం డ్రీమ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్ లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రేపటి జాతి నిర్మాతలను మలచడం సివిల్ ఇంజనీరింగ్ కరికులంపై శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించారు.

గీతం కోరి ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి మార్గదర్శనంలో ప్రఖ్యాత పరిశోధన విద్యాసంస్థల నిపుణులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఎన్ఐటి సూరత్ కు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కట్టా వెంకటరమణ, ఐఐటి ధారపాడు సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ విసిటింగ్ ప్రొఫెసర్ కె.వి. జయకుమార్, ఎన్ఐటి సూరత్ పూర్వ ఆచార్యుడు డాక్టర్ రవిశంకర్, నిపుణులు తమ విలువైన మార్గదర్శనాన్ని అందించారు. పరస్పర చర్చలు ఆలోచన మార్పిడికి సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో వినూత్న విధానాల అన్వేషణకు వేదికగా ఈ కార్యశాల ఉపయోగపడింది. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే కాకుండా పరిశ్రమ కన్నా అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేసి పాఠ్యాంశాలను రూపొందించడంలో నిపుణులంతా చురుకుగా పాల్గొన్నారు.

read also : లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళులర్పించిన మాజీమంత్రి చిన్నారెడ్డి..

అలాగే కోటి పరీక్షలను చేదించేలా విద్యార్థులను సన్నద్ధం చేసేలా ఈ కార్యశాల కొనసాగింది. తమకు సంబంధించిన పాఠ్యాంశాలను నిపుణులు బోధించారు. గీతం హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు ప్రాంగణాలకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు డాక్టర్ చేవూరు అఖిలేష్ డాక్టర్ ముకుందరావు డాక్టర్ శుభ అవినాష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత పాఠ్యాంశాలను మెరుగుపరచడానికి వారి విలువైన సూచనలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.