Read News in Telugu Language
adsdaksha

google : గోదాట్లోకి తీసికెళ్లిన గూగుల్.. కాపాడిన స్థానికులు..

దక్ష న్యూస్, ఇంటర్ నెట్ డెస్క్:

తెలియని ప్రాంతంలో అదీ రాత్రి సమయంలో తనను నమ్ముకున్న వారిని గూగుల్ ( google ) గోదాట్లోకి తీసికెళ్లిన ఘటన సోషల్ మీడియా ( social media ) లో వైరల్ గా మారింది. స్థానికుల సాయంతో బైటపడ్డ బాదితులు బతుకుజీవుడా అని గూగుల్ ఇచ్చిన షాక్ తో దిమ్మెర పోగా, నెటీజన్లు మాత్రం ఆశ్చర్యంతో ఔరా అని ముక్కున వేలేసుకుంటుంన్నారు.

read also : తెలంగాణ సీఎం ను కలిసిన మేఘాలయ ముఖ్యమంత్రి..

స్మార్ట్ ఫోన్ ( smart phone ) లు రాకముందు తెలియని ప్రాంతాల్లోకి వెళితే అక్కడ కనిపించిన ఎవరినో ఒకరిని మనం వెళ్ళాల్సిన అడ్రస్, లేదా రోడ్ అడిగి తెలుసుకొని మరీ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఆండ్రాయిడ్ (android ) సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, అదీ 5జీ టెక్నాలజీ ( 5g technology ) కూడా వచ్చేశాక అందరూ అబ్డేట్ అయిపోయారు. ఎక్కడికి వెళ్లాలన్నా అడ్రస్ లు అడగడం మానేసి సెల్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ( google map ) ఆన్ చేసి లోకేషన్ ( location ) పెట్టుకుని మరీ వెళ్ళిపోతున్నారు. అయితే అదీ కరెక్ట్ గా దారి చూపిస్తే పర్వాలేదు.. కానీ పొరపాటున గూగుల్ ఏ చెరువులోకో బావిలోకో తీసుకెళ్తే అంతే సంగతులు.

Hospital

read also : జయరాజ్ కి కాళోజీ నారాయణ రావు అవార్డు .. ప్రకటించిన సీఎం కేసిఆర్..

సరిగ్గా అలాంటి సంఘటనే బుధవారం రాత్రి గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి వద్ద జరిగిన ఈ సంఘటన చూసి టెక్నాలజీని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక నెటీజన్లు తలలు పట్టుకుంటుంన్నారు. ఇక వివరాల్లోకెళితే.. గౌరవరం వెళ్ళాల్సిన ఓలారీ డ్రైవర్ ఆ ప్రాంతానికి కొత్త కావడంతో గూగుల్ మ్యాప్ పెట్టుకొని బయల్దేరాడు. చీకటి సమయం కావడంతో గూగుల్ మ్యాప్ తో సరైన దారిలోనే వెళ్తున్నానని అనుకున్నాడు. కానీ కొంతదూరం వెళ్లేసరికే లారీ ఆగిపోయింది. క్యాబిన్ వరకు నీళ్లు చేరుకోవడంతో ఇంజిన్ ఆగిపోయింది. దీంతో డ్రైవర్, క్లీనర్ కిందకు దిగి చూస్తే తాము గౌరవెల్లి ప్రాజెక్టులోని గోదావరి నీళ్లలో చిక్కుకున్నట్లు గమనించారు. వెంటనే నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సమీపంలో ఉన్న రామవరం గ్రామంలోకి వెళ్లి అక్కడి వారితో జరిగిన విషయం చెప్పారు. దాంతో ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్ వెంటనే అక్కడికి చేరుకుని జేసీబీ సహాయంతో లారీకి తాళ్లు కట్టి అతి కష్టంమీద బయటకు లాగారు. స్థానికుల పుణ్యమా అంటూ బతుకుజీవుడా అని ప్రాణాలు అరచేత్తో పట్టకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

read also : భాజపా, భారాస సఖ్యత వార్తల్లో నిజం లేదు..మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో బండి సంజయ్..

Leave A Reply

Your email address will not be published.