Read News in Telugu Language
adsdaksha

మాది ప్రజా ప్రభుత్వం.. త్వరలో రూ.500లకే గ్యాస్, 200యూనిట్ల విద్యుత్ ఫ్రీ : అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళి సై ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 8

మాది ప్రజా ప్రభుత్వం అని, ప్రజాకాంక్షలు నెరవేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీకి హాజరైన గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేస్తామని తమిళిసై చెప్పారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలు రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు గవర్నర్ వివరించారు.

Read also: హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు.. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు..

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, యువతకు 2 లక్షల ఉద్యోగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని అదేవిధంగా మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఇ విధానం తెస్తామని చెప్పారు. వెయ్యి ఎకరాల్లో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. విదేశీ కంపెనీలతో కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.

Hospital

టీఎస్పీఎస్సీ, ఎస్.హెచ్ఐర్.సి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను తీసుకొచ్చామన్నారు. టీఎస్పీఎస్సీ పూర్తిగా ప్రక్షాళన చేశామని త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని గవర్నర్ చెప్పారు. రూ.2వేల కోట్లతో ఐఐటీలను ఆప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. త్వరలో గ్రీన్ ఎనర్జీ విధానాన్ని తీసుకొస్తామని గవర్నర్ తమిళిసై అన్నారు.

Read also: కటింగ్ కోసం బిల్డింగ్ పైనుంచి దూకేశాడు.. ఆత్మహత్యకు యత్నించిన అనురాగ్ వర్సిటీ స్టూడెంట్ ..

రాష్ట్రంలో ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్ లుగా హుస్సేన్ సాగర్, లక్నవరం చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటకరంగ అభివృద్ధి కోసం వారసత్వ కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆలయాలు, చెరువుల అభివృద్ధి కోసం సమగ్ర పర్యటక విధానం తీసుకొస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టనున్నట్లు గవర్నర్ సౌందర్ రాజన్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.