Read News in Telugu Language
adsdaksha

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 14

నేటి నుండి ఆర్టీసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు..

ఆర్టీసి ( rtc ) కార్మికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆర్టీసి బిల్లుపై నెల రోజుల తర్వాత గవర్నర్ తమిళిసై ( governor tamilisai ) గురువారం ఆమోద ముద్ర వేశారు. దాంతో టీఎస్ ఆర్టీసీ కార్మికుల కొన్ని ఏళ్ళ కల ఫలించిందని, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు నేడు ఆమోదం పొందడం హర్షించాల్సిన విషయం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసి ఉద్యోగులందరికీ మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలియజేశారు.

read aalso : త్వరలో జిల్లాలో బిఎస్సీ పారా మెడికల్ కళాశాల.. మంత్రి హరీశ్ రావు..

Hospital

ఆలస్యంగా అయినా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.. నేటి నుండి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్నర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.

దీర్ఘకాలికంగా ఆర్టీసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో పెట్టీ అమలు చేసిన తీరు దేశానికే అదర్శనీయమని మంత్రి అన్నారు.

read also : మ‌హిళా లోకాన్ని చైత‌న్య ప‌ర‌చండి ..మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ..

ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సిఎం కేసీఅర్ తీసుకున్న నిర్ణయం తాను రవాణా శాఖ మంత్రి హోదాలో ఉన్న సమయంలో జరగడం, బిల్లు అమలు అవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఆ అదృష్టం కల్పించిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.