Read News in Telugu Language
adsdaksha

గ్రూప్ 1 దరఖాస్తులు 4.03 లక్షలు..సవరణకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం ..

దక్ష న్యూస్, వరంగల్ : మార్చి 17

తెలంగాణలోని నిరుద్యోగ యువత పదేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. నియంత కేసీఆర్ పాలనలో ఏ ఒక్క నోటిఫికేషన్ ముందుకు సాగింది లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే దాదాపు 30వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19న కాంగ్రెస్ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Hospital

read also : ప్రణీత్‌రావుకు 7రోజుల పోలీసు కస్టడీ ..అనుమతినిచ్చిన నాంపల్లి కోర్టు ..

సదరు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసిపోయింది. మొత్తం గ్రూప్-1 ఎగ్జామ్‌కు 4.03 లక్షల దరఖాస్తులు అందాయని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) తెలిపింది. అయితే ఈ దరఖాస్తుల సవరణకు మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇదిలావుంటే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను జూన్ 19న, మెయిన్స్‌ను అక్టోబరు 21 నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించారు.

 

Leave A Reply

Your email address will not be published.