Read News in Telugu Language
adsdaksha

త్వరలో గ్రూపు-1 ..! కొత్తగా 60 పోస్టులు యాడ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 6

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త తెలిపింది. త్వరలో గ్రూపు -1 క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే గ్రూపు 1 అభ్యర్థులకు 60 పోస్టులు కొత్తగా యాడ్ చేస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూపు 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ నోటిఫికేషన్ కి అదనంగా మరో 60 పోస్టులను కలుపనుంది తెలంగాణ ప్రభుత్వం.

Read also: నిలిచిపోయిన యూపీఐ సేవలు.. వినియోగదారులకు ఇబ్బందులు..

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్..

Hospital

ఇటీవలే తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎక్కువగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై చర్చ నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు రద్దైన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా కేవలం 60 పోస్టులు మాత్రమే కలుపుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Read also: కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే తీవ్ర నష్టం : మాజీ సీఎం కేసీఆర్..

2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 2,80,000 మంది హాజరయ్యారు. ఇప్పటికే ఆ పరీక్ష రెండు సార్లు వాయిదా పడింది.

Leave A Reply

Your email address will not be published.