Read News in Telugu Language
adsdaksha

గృహలక్ష్మి సీఎం కేసిఆర్ మానస పుత్రిక : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 28

పేదల సొంతింటి కల నెరవేర్చిన మహానుభావుడు, ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌  ( cm kcr ) అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. తెలంగాణ ( telangana ) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ ( gruhalakshmi ) పథకం ద్వారా మంజూరైన ఉత్తర్వుల పత్రాలను గురువారం ఖమ్మం ( khammam )  భక్తరామదాసు ( bhaktharamadasu ) కళాక్షేత్రంలో లబ్దిదారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మం నగరంలోని 17, 18, 24, 42, 43, 46, 49, 50, 52, 53, 55, 56 డివిజన్లలో మంజూరైన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను స్వయంగా అందజేయడం ఎంతో సంతృప్తి నిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోను సొంత ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింపజేస్తామని, ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు.

read also : puvvada : ఖమ్మం నా ఇల్లు .. ఇక్కడి ప్రజలంతా నాకుటుంబ సభ్యులే..

గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని, తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

Hospital

పార్టీల కతీతమైన ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గత పాలకుల హయాంలో గ్రామాలకు లక్ష రూపాయల నిధులు తేవాలంటే సాధ్యం కాని దారుణమైన పరిస్థితులు ఉంటే, నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, బిసి బంధు, ఆసరా పెన్షన్లు, వంటి సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు. నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించేది ఒక్క కెసిఆర్ మాత్రమే అని మళ్ళీ బిఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

read also : 29న మంత్రివర్గ సమావేశం..?

కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ రాపర్తి శరత్, బుర్రి వెంకట్ కుమార్, పగడాల శ్రీవిద్య నాగరాజు, మోతారపు శ్రావణి, పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, ధనాల రాధ, మందడపు లక్ష్మీ మనోహర్, కమర్తపు మురళీ, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి రావు, కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, దండా జ్యోతి రెడ్డి, మక్బూల్, నాయకులు ధనాల శ్రీకాంత్, బుర్రి వినయ్ కుమార్, బండారు శ్రీనివాస రావు, సూత్రాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.