Read News in Telugu Language
adsdaksha

వారెంట్ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయండి..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 30

గుబ్బగుర్తి సభలో మంత్రి కేటిఆర్..

వారెంట్ లేని కాంగ్రెస్ ( congress ) ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయాలని మంత్రి కేటిఆర్ ( ktr ) పిలుపునిచ్చారు. శనివారం
కొణిజర్ల ( Konijarla ) మండలం గుబ్బగుర్తి  ( gubbagurthi ) లో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి కేటిఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada Ajay kumar ), ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీ ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా పైకి ఎదగాలని ఆకాంక్షించారు.

Read also : ఇషాసింగ్ కి సీఎం కేసీఆర్ అభినందనలు

Hospital

ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలని కేటిఆర్ అన్నారు. పనికి రాని హామీలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నపార్టీలను తరిమి కొట్టాలన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావులకి ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, కూరాకుల నాగభూషణం, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బాలసాని లక్షీనారాయణ, కలెక్టర్ వి.పి. గౌతమ్, గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.