Read News in Telugu Language
adsdaksha

పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్ ..

దక్ష న్యూస్: హైదరాబాద్ : మార్చి 15

పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( gudem mahipal reddy ) సోదరుడు (గూడెం మధుసూదన్ రెడ్డి)ని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంతోష్‌ ఇసుక, గ్రానైట్‌లను నడుపుతున్న మధుసూదన్‌రెడ్డిని పటాన్‌ చెరు ( patan cheruvu ) పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెల్లవారుజామున గూడెం మధు ఇంటికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుని పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

read also : tspsc : గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు .. ఈనెల 16 వరకు పెంచిన టీఎస్పీఎస్సీ..

Hospital

ఇటీవల పఠాన్ చెరు మండలం లక్తారంలోని మధుసూదన్‌రెడ్డి కుమారుడి పేరిట ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. కేంద్ర పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి తవ్వకాలు చేస్తున్నారు. కాగా, మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌ అనంతరం ఆయన అనుచరులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

read also : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గింపు

Leave A Reply

Your email address will not be published.