Read News in Telugu Language
adsdaksha

రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వంలో ఏ శాఖకు లేదు.. హనుమకొండ లో సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు..

దక్ష న్యూస్, వరంగల్ : ఏప్రిల్ 7

హనుమకొండ జిల్లాలోని అంబేద్కర్ భవన్లో సమాచార హక్కు చట్టం పైన ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ ( chanti mudiraj ), రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి ( sura sravanthi ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీఐ ( rti ) మాజీ సమాచార కమీషనర్ గుగులోత్ శంకర్ నాయక్ ( guguloth sankarnayak ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శంకర్ నాయక్  మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం అమలుపై ప్రభుత్వానికి పారదర్శకత ఉండాలన్నారు. అధికారులు జవాబు దారిగా ఉన్నప్పుడే సమాచార హక్కు చట్టం లక్ష్యం నెరవేరుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు.

Hospital

read also : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్..

సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందని శంకర్ నాయక్ అన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్య లు తీసుకుంటుందన్నారు.

read also : ఇండియా కూటమిని గెలిపించాలి : సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు ..

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ( jangidi srinivas )  మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి అంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగేండ్ల వెంకటేష్, ఉమ్మడి వరంగల్ ( warangal ) జిల్లా యూత్ ఫోరం అధ్యక్షులు నమిండ్ల హరీష్, కుమారస్వామి, వరంగల్ జిల్లా యూత్ ఫోరం అధ్యక్షులు సాదబోయిన రాజు, వీరేందర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, మల్లె పాక నాగరాజు, పవన్, ప్రవీణ్, పెండేల కార్తీక్, కిరణ్, బందెల యాదలక్ష్మి, గోపికారాణి, డాక్టర్ కీర్తి రెడ్డి, రజిత, లయన్స్ క్లబ్ పద్మజ, రాఖి, దేవిక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.