Read News in Telugu Language
adsdaksha

మంత్రి గన్‌మెన్ ఆత్మహత్య .. తుపాకీతో కాల్చుకుని సూసైడ్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 5

ఆర్థిక ఇబ్బందులే కారణమని అంచనా..

విచారణ చేపట్టిన పోలీసులు..

Hospital

తెలంగాణ విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఫజల్ సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఫజల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఫజల్ అంతకుముందు వరకు తన కూతురుతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. కాగా ఈ ఆత్మహత్య కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదిలావుంటే.. ఫజల్ ఉదయం 7 గంటల సమయంలో తన కూతురుతో కలిసి విధులకు వచ్చారని తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలు కూతురుతో చర్చించారని సమాచారం. ఫజల్ అలీ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు.

అయితే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎస్కార్ట్ ఇంఛార్జిగా ఆయన పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఫజల్ తన ఇద్దరు కూతుళ్ల పెండ్లిళ్ల కోసం ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.