Read News in Telugu Language
adsdaksha

గురుకులాలకు సొంత భవనాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 25

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో భవనానికి 10-15 కోట్లు ఖర్చు చేస్తారు. మొదటి దశలో భూములు గుర్తించిన గురుకులాలకు భవనాలు నిర్మించ నున్నారు. ఇలాంటి గురుకులాలు ఎన్ని ఉన్నాయి? ఏడాదిలో ఎన్ని భవనాలు పూర్తి చేస్తారు? ఎన్ని నిధులు అవసరమో వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.

భవనాల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే గురుకుల సొసైటీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. త్వరలోనే వాటికి ఆమోదం లభించే అవకాశం ఉందని సొసైటీలు భావిస్తున్నాయి.

Read also: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారత్‌ విద్యార్థి మృతి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 731 గురుకులాలు ఏర్పడ్డాయి. ఇందులో 85 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు అద్దె భవనాల్లో ప్రారంభమయ్యాయి. మొదట్లో 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభించినా.. ఆ తర్వాత ఏటా తరగతుల అప్ గ్రేడేషన్ తో జూనియర్ కాలేజీల స్థాయికి చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరిగినా కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Hospital

తరగతి గదిలోనే భోజనం, వసతి కోసం నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శాశ్వత భవనాల నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా భూములను గుర్తించారు. కనీసం 5 నుంచి 10 ఎకరాల్లో భవనాలు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే అప్పట్లో నిధులు మంజూరుకాక పురోగతి లేదు. గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి సంవత్సరంలో ఒక్కో సొసైటీ 20 గురుకులాల వరకు భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read also: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం .. 13 మందికి గాయాలు..

జూన్‌లో కొత్త ఉపాధ్యాయుల కోసం పోస్టింగ్‌లు…

కొత్తగా ఎంపికైన గురుకుల ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులను వచ్చే జూన్‌లో (2024-25 విద్యా సంవత్సరం) పోస్ట్ ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి. ఇటీవల 7,800 రిక్రూట్‌మెంట్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున కొన్ని జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్న వారికి పోస్టింగ్‌లు ఇస్తే సీనియారిటీ సమస్య తలెత్తుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొసైటీల వారీగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి జూన్ లో పోస్టింగ్ లు ఇవ్వాలని సంక్షేమశాఖ అధికారులు నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.