Read News in Telugu Language
adsdaksha

జమిలీలు తెచ్చినా జంబ్లింగ్‌లు చేసినా బీఆర్ఎస్ దే విజయం..

- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..

బీజేపీ ( bjp ) జమిలి పేరుతో ఎన్నికల డ్రామాలు ఆడుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ( harish rao ) మండిపడ్డారు. బీజేపీ ఎన్ని జెమిలీలు తెచ్చినా జంబ్లింగ్‌లు చేసినా బీఆర్ఎస్ ( brs ) విజయం మాత్రం ఖాయమన్నారు. సోమవారం పాలకుర్తి ( palakurthi ) లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ( errabelli dayakar rao ), ఇంద్రకరణ్ రెడ్డి ( indrakaran reddy ), సత్యవతి రాథోడ్‌ ( sathyavathi radhod ) లతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొంత మంది డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెరలేపుతున్నారని అన్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌ ( kcr )ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని స్పష్టం చేశారు.

read also : భవిష్యత్ తరాలకు సాహిత్య మాధుర్యాన్ని అందజేయాలి..

Hospital

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామనీ, ఇతరులు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మూడోసారి గెలిస్తే అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇతరులు గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.

read also : గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, వేరే ప్రభుత్వం వస్తే కరెంట్ వచ్చే పరిస్థితి లేదని మంత్రి పేర్కొన్నారు. 75 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అలాగే రైతు రుణమాఫీ చేస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్‌ మాత్రం బీఆర్ఎస్‌దేనని తేల్చి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.