Read News in Telugu Language
adsdaksha

Haryana : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం… అదుపు తప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా..

దక్ష న్యూస్, ఇంటర్ నెట్ డెస్క్ : ఏప్రిల్ 11

-ఐదుగురు చిన్నారులు మృతి,15 మందికి గాయాలు..

హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు మరణించారు. పలువురు చిన్నారులు గాయపడ్డారు. కనీనా పట్టణం సమీపంలోని కనీనా-దాద్రి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బస్సు అతివేగంతో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికుల సాయంతో పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Hospital

Read also: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి..

స్థానికుల కథనం ప్రకారం బస్సు కనీనాలోని GL పబ్లిక్ స్కూల్‌కు చెందినది. ఉన్హాని గ్రామ సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. ఈద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం అయినప్పటికీ, చాలా ప్రైవేట్ పాఠశాలలు తెరిచి ఉన్నాయి. అదే సందర్భంలో జీఎల్ పబ్లిక్ స్కూల్ కు సెలవు ఇవ్వలేదు.

Read also: భద్రాచలానికి రూపాయి ఇవ్వలే… రాముడితో పంచాయితీ లేదు బీజేపీతోనే : మాజీ మంత్రి కేటీఆర్..

డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Leave A Reply

Your email address will not be published.