Read News in Telugu Language
adsdaksha

హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి దశదిన కర్మకు హాజరయిన జిల్లా ఎస్పీ వినీత్..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అక్టోబర్ 12

గత నెల 30న భద్రాచలం ( bhadrachalam ) బందోబస్తు నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ( head constable sridevi ) దశదిన కర్మకు జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ( sp dr. vinith ) హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ, హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి మరణం జిల్లా పోలీస్ శాఖకు తీరని లోటని అన్నారు. ఆమె మంచి అధికారిగా పేరు ప్రతిష్టలు సాధించుకున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన వలన శ్రీదేవి ని కోల్పోవడం చాలా భాధాకరమన్నారు. శ్రీదేవి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు.

read also : ఖమ్మంలో ఐదు రోజుల పాటూ ఉచిత వైద్య శిబిరం..

అనంతరం పోలీస్ అధికారులతో కలిసి సంహపంక్తి విందులో పాల్గొన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Hospital

read also : మానవత్వానికే కాదు దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ వైద్య నారాయణుడు..

అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజయ్ బాబు, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు జిల్లాలోని సిఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

read also : మన వైద్యుడి చెంతకు విదేశీ పేషెంట్ లు .. వైద్యరంగంలో సంచలనం ..

Leave A Reply

Your email address will not be published.