Read News in Telugu Language
adsdaksha

హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి.. మృతుల్లో ‘యాక్సెస్ బ్యాంక్’ సీఈవో..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 11

హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం చెందిన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియా-నెవడా
సరిహద్దుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ సీఈవో ఉన్నారు. ‘యాక్సెస్ బ్యాంక్’ (Access Bank) సీఈవో హెర్బర్ట్ విగ్వే తన భార్య, కుమారుడు మరికొందరితో కలిసి యూరోకాప్టర్ ఈసీ 130లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా శాన్ బ్రెనార్డినో కౌంటీ వద్ద శుక్రవారం రాత్రి ఘటన జరిగింది.

Hospital

Read also: శెభాష్ రేవంత్..! ప్రజా ప్రభుత్వంపై కేఏ పాల్ రియాక్షన్..

దాదాపు 3,000 అడుగుల ఎత్తు నుంచి అది కుప్పకూలడంతో అందులో ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. సమీపంలోని ఐ-15 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదాన్ని గమనించి 911కు కాల్ చేశారు. ప్రమాదంపై ఎస్ఏఏ దర్యాప్తు చేపట్టింది. మృతుల్లో నైజీరియాకు చెందిన ఎనీఎక్స్ గ్రూపు మాజీ చైర్మన్ అబింబోలా, ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. ‘ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి ఇది పెద్దషాక్ అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవాలా ట్విట్టర్ లో పోస్టు చేశారు. హెర్బర్ట్ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. నైజీరియా ‘యాక్సెస్ బ్యాంక్’ ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలు అందిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.