Read News in Telugu Language
adsdaksha

సోరెన్ కు చుక్కెదురు.. జార్ఖండ్ మాజీ సీఎం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం..

దక్ష న్యూస్, హైదరాబాద్ ఫిబ్రవరి 2

జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ ( hemant soren ) కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ ( ed ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని సోరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆయన దాఖలు పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జార్ఖండ్ ( jharkhand ) హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే అంతకు ముందు సోరెన్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికి సుప్రీం సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి ప్లాన్ లో భాగంగానే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. హేమంత్ సోరెన్ తరపున సుప్రీం కోర్టు విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ బుధవారం రాత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సోరెన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. రాష్ట్ర హైకోర్టులు రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానాలని, ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నట్లు చెప్పారు.

Hospital

Read also: కేజ్రీ మరోసారి డుమ్మా.. ఐదోసారి ఈడీ సమన్లు లెక్కచేయని ఢిల్లీ సీఎం..

మరోవైపు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత ఆ రాష్ట్ర సీఎంగా చంపై సోరెన్ పేరును ఆ పార్టీ ప్రతిపాదించింది. ఆ తర్వాత చంపై సోరెన్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్‌లో చంపై సోరెన్ సారధ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Leave A Reply

Your email address will not be published.