Read News in Telugu Language
adsdaksha

అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే..!

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 18

భారతదేశం యావత్తు అత్యంత భక్తి ప్రపత్తులతో ఎదురు చూస్తున్న రామజన్మ భూమి అయోధ్య ( ayodhya ) రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టంగా మిగిలిపోనుంది. అయితే చరిత్రలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకునేందుకు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట రోజు సంపన్నులంతా ఎవరికితోచిన రీతిలో వారు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే .. టాలీవుడ్ హీరో ప్రభాస్ ( hero prabhas ) మాత్రం అన్నిదానాల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైన అన్నదానానికి ప్రాధాన్యమిస్తూ అయోధ్యకు వచ్చే అతిథుల భోజనం ఖర్చు తానొక్కడినే భరిస్తానని ముందుకు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విగ్రహ ప్రతిష్టాపన రోజు అయోధ్యలో భోజనాలకు అయ్యే రూ. 50 కోట్ల రూపాయలు ఖర్చు ప్రభాస్ తానొక్కడినే భరిస్తానని ముందుకొచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. దాంతో అభిమానులు, నెటీజన్లు ఫిదా అవుతున్నారు. మన రాజు గారు అంటే రాజు గారే మరి అని కామెంట్లు చేస్తున్నారు.

Hospital

read also : తమ్మినేని కి మంత్రి పొంగులేటి పరామర్శ .. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా డాక్టర్ లకు సూచన..

అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే అంటారు సినీ రంగంలోని వారు. తోటి నటీనటుల నుండి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే అని చెప్పుకుంటుంటారు. అలాంటిది లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే అయోధ్య రామందిర ప్రతిష్ట వేళ జరిగే అన్నదానం కార్యక్రమం అంటే ప్రభాస్ ఊరుకుంటాడా అని చర్చించుకుంటుంన్నారు.

ఇక జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్టా కార్యక్రమం వేళ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ నలుమూల నుంచి, ఇతర దేశాల నుంచి కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యకు రానున్నారు. ఈ భోజనాల కోసం అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఒక్క రోజు అన్నదానానికి అయ్యే రూ. 50 కోట్ల ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తానని ప్రభాస్ ముందుకు రావడం అభినందనీయం

Leave A Reply

Your email address will not be published.