Read News in Telugu Language
adsdaksha

కరోనా తో సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూత..

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 29

డీఎండీకే అధినేత తమిళ స్టార్ హీరో, విజయ్ కాంత్ ( Vijay kanth ) గురువారం అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయం విదితమే. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో ఆయన్ను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్చారు. శ్వాసకోశ సమస్యల కారణంగా డాక్టర్ లు విజయకాంత్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే పరిస్థితి విషమిండంతో ఆయన మృతి చెందారని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

విజయకాంత్ తుది శ్వాస విడవటంతో తమిళ ఇండస్ట్రీ, రాజకీయ శ్రేణుల్లో విషాదం నెలకొంది. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో, చాలా బలహీనంగా కనిపించారు. తాజాగా మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. అయనకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధరాణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్సను కొనసాగించారు. అయితే, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి కన్నుమూశారు.

Read also: ఆదాయం కమ్యూనిటీ సర్టిఫికెట్ లు అవసరం లేదు..

విజయకాంత్ మృతి విషయం తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

Hospital

విజయకాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తమిళ చలనచిత్ర ప్రపంచంలో విజయకాంత్ ఒక లెజెండ్ అని చెప్పారు. తన విలక్షణమైన అభినయంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టారని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా సేవకు కట్టుబడి ఉన్నారని, తమిళనాడు రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

తనకు విజయకాంత్ సన్నిహిత మిత్రుడని, ఆయనతో తనకు ఉన్న జ్ఞాపకాలను మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ విషాదకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం : భట్టి

కాగా విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి.1952 ఆగస్ట్ 25వ తేదీన మధురైలో జన్మించారు.సినిమాల్లో అడుగుపెట్టిన తరువాత ఆయన తన పేరును విజయకాంత్ గా మార్చుకున్నారు.27 ఏళ్ల వయసులో ఇనిక్కుమ్ ఇలమై అనే చిత్రంతో అరంగేట్రం చేశారు.దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్ 20కి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించడం విశేషం. హీరోగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ విజయకాంత్ రాణించారు.ఆయనకు బలమైన ఫ్యాన్ బేష్ ఏర్పడింది. సినిమాల్లో నటనే కాకుండా నిర్మాత, దర్శకునిగా తన సేవల్నీ అందించాడు. ఇదే సమయంలో రాజకీయాలపై ఇంట్రస్టు ఉండటంలో 2005 వ సంవత్సరంలో విజయకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి, డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2011 నుంచి 2016 సంవత్సరం వరకు తమిళనాడులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2016లో విజయకాంత్ ఓటమి పాలయ్యారు. విజయ్‌ కాంత్‌ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 70 ఏళ్ల విజయ్‌ కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.

Leave A Reply

Your email address will not be published.