Read News in Telugu Language
adsdaksha

నెల రోజుల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలి : తీర్పు వెలువరించిన హై కోర్ట్..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 5

గతంలో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల అనంతరం కొంత మంది అభ్యర్థులు ప్రశ్న పత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని హైకోర్టుకు వెళ్ళిన విషయం విదితమే.

దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ నాలుగు మార్కులు కలపాలని తీర్పు నిచ్చింది. అయితే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు సింగల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లారు.

Read also: భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ..

దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై, ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

Hospital

Read also: 2వ టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికాపై భారత్ విజయం..

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును, హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో 15 వేల 640 మంది అభ్యర్థులు కానిస్టేబుళ్లుగా మారనున్నారు. దీంతో కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు.

నెల రోజుల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు స్పష్టం చేసింది.

Read also: కాంగ్రెస్ పార్టీ లో వైఎస్ఆర్టీపీ విలీనం..హస్తం పార్టీలో చేరిన షర్మిల..

రాష్ట్ర పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ప్లిమినరీ, ఈవెంట్స్, మెయిన్స్ రాసిన తర్వాత ఫలితాలు విడుదల చేశారు.

Leave A Reply

Your email address will not be published.