Read News in Telugu Language
adsdaksha

న్యూ శ్లోక స్కూల్ లో హిందీ దివస్ వేడుకలు..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 14

ఖమ్మం ( khammam ) నగరంలోని న్యూ శ్లోక స్కూల్లో ( new sloka school )  గురువారం హిందీ దివస్ ( hindi diwas ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంటెంట్ భానుచందర్ ప్రోత్సాహంతో, హిందీ దివస్ వేడుకలు జరిగాయి. ఖమ్మం రూరల్ మండలంలోగల న్యూ శ్లోక స్కూల్లో ఈ వేడుకలను నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ గాదే మనస్విని పర్యవేక్షించారు.

read also : ఇక వైద్య రంగానికి హబ్ గా ఖమ్మం.. 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తి..

Hospital

కార్యక్రమంలో న్యూ శ్లోక స్కూల్ ప్రిన్సిపాల్ కె. సదన్, కరస్పాండెంట్ నవీన్ కుమార్, ఇంచార్జ్ మంజులా రెడ్డి, హయ్యర్ హిందీ టీచర్ ఎస్.కె. అమీర్, లోయర్ హిందీ టీచర్ కవిత పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు హిందీ దివస్ పై అవగాహన కల్పించారు. అనంతరం స్పీచ్, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. హిందీ దివస్ వేడుకలు తమ పాఠశాలలో నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యం నెహ్రూ యువ కేంద్ర కు కృతజ్ఞతలు తెలిపారు.

read also : ఓటర్ల జాబితా పై నిగ్గు తేల్చండి :

Leave A Reply

Your email address will not be published.