Read News in Telugu Language
adsdaksha

‘మోదీ కీ గ్యారెంటీ 2023’ లో బిజేపి వరాల జల్లు..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 4

ఛత్తీస్ గఢ్ లో బీజేపీ మేనిఫెస్టో ..

‘మోదీ కీ గ్యారెంటీ 2023’ పేరుతో బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా ( home minister amit shah ) మ్యానిఫెస్టో (manifesto ) ను శుక్రవారం రాయ్​పుర్ ( roipur ) ​లో విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వస్తే వివాహిత మహిళలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం చేస్తామని అమిత్ షా తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు.

read also : 93 ఏళ్ళ బామ్మకు ఇంగ్లీష్ లో పిహెచ్ డి పట్టా..

ఛత్తీస్​గఢ్ రాష్ట్ర ప్రజలపై బీజేపీ అధిష్టానం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటా ధాన్యాన్ని రూ.3,100కు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.

బిజేపి మేనిఫెస్టోలో అంశాలు :

1) ఎకరాకు 21 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు.

2) రెండేళ్లలో లక్ష ఖాళీ పోస్టుల భర్తీ,

3) భూమిలేని రైతులకు ఏటా రూ.10 వేల ఆర్ధిక సహాయం,

4) రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు,

5) క్వింటాల్ కు రూ.3100 చొప్పున వరి ధాన్యం కొనుగోలు,

Hospital

6) ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు,

7) భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం 10000 రూపాయలు,

8) ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షల వరకు చికిత్స,

9) యువతకు ఉద్యమం క్రాంతి యోజన కింద 50 శాతం సబ్సిడీపై వడ్డీ లేకుండా రుణం,

10) గ్యాస్ సిలిండర్ రూ.500,

11) కళాశాల విద్యార్థులకు నెలవారీ ప్రయాణ భత్యం,

12) ఐఐటీ తరహాలో ప్రతి జిల్లాలో సీఐటీ ప్రారంభం,

13) పంచాయతీ స్థాయిలో 1.5 లక్షల మంది యువకుల నియామకం వంటి అంశాలను బీజేపీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​, పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.

read also : దీని భావమేమి చంద్ర శేఖరా.. మండుటెండల్లో ప్రజా ఆశీర్వాద సభలు..

ఇదీలా ఉండగా ఛత్తీస్​గఢ్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్ ఘడ్ లోని 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. గత ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 68 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 15 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.