Read News in Telugu Language
adsdaksha

హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలంలో గజం ధర రూ. 1 లక్ష..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఆగస్ట్ 23

తొలి రోజు సరాసరి రేటు రూ.63.512లు

హెచ్ఎండిఏ  ( hmda ) వెంచర్ ప్లాట్ల ( plots ) వేలానికి అమిత ఆధరణ లభిస్తుంది. హైదరాబాద్ ( hyderabad ) మోకిల ( mokila ) లో నిర్వహించిన మొదటి రోజు ఆన్లైన్ వేలంలో గజం అత్యధికంగా లక్ష రూపాయల ధర పలకడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్ఎండిఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ( mstc ) ద్వారా నేటి నుంచి ఐదు రోజులపాటు ఆన్ లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నది.

Hospital

read also : దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్ధులను ప్రకటించండి..

బుధవారం మొదటి రోజు ఉదయం 30 ప్లాట్లకు, మధ్యాహ్నం మరో 30 ప్లాట్లకు వేలం ప్రక్రియ జరిగింది. వాటిలో అత్యధికంగా గజం లక్ష రూపాయల చొప్పున మోకిల భూముల రేటు పలకడం విశేషం. మోకిలా లేఅవుట్లో తొలి రోజు గజం రేటు సరాసరిగా రూ.63,513లుగా నమోదు కావడం గమనార్హం.

మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ చేకూరింది. మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.