Read News in Telugu Language
adsdaksha

హైదరాబాద్‌కు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ..

దక్ష న్యూస్, హైదరాబాద్ డిసెంబర్ 20

రాష్ట్రంలో రోజురోజుకీ చలిగాలులు తీవ్రతరం అయి చలి పెరుగుతున్న దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఐఎండీ (IMD) హైదరాబాద్‌ ( Hyderabad ) లో ఎల్లో అలర్ట్‌  ( yellow alert ) జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో తెల్లవారుజామున విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Hospital

రాబోయే ఐదు రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా పడిపోవచ్చని అంచనా వేస్తూ, రాబోయే చలిగాలుల కారణంగా హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, హయత్‌నగర్‌, కూకట్‌పల్లి, మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బేగంపేట, ముషీరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

నగరం దాదాపు పూర్తిగా చలి భారీన పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
బుధవారం హైదరాబాద్‌లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీలో అత్యల్ప ఉష్ణోగ్రత 12.2 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్‌లో 12.3 డిగ్రీల సెల్సియస్, వెస్ట్ మారేడ్‌పల్లిలో 13.8 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
బండ్లగూడలో 14.3 డిగ్రీల సెల్సియస్, శివరాంపల్లె లో 14.6 డిగ్రీల సెల్సియస్‌, కుత్బుల్లాపూర్లో 14.8 డిగ్రీల సెల్సియస్,
నెరెడ్‌మెట్ లో 14.8 డిగ్రీల సెల్సియస్, జీడిమెట్ల లో 14.9 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.