Read News in Telugu Language
adsdaksha

Delhi: ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 19

నేను కాదు .. మేము అనే నినాదంతో ముందుకు..

ఇండియా ( india) కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీ ( delhi ) లోని అశోక హోటల్‌లో సాయంత్రం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కూటమి భేటీ అవుతోంది..

Hospital

2024 లోక్‌సభ ఎన్నికలకు ( lok sabha election ) సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు కూటమి ముందున్న సవాళ్లలో ప్రధానమైనవిగా భావిస్తున్నారు. ప్రధాని మోదీకి కౌంటర్‌గా ‘నేను కాదు.. మేము’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ( congress ) సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

మధ్యభారతంలోని మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌తో ఉన్న విభేదాలను కాంగ్రెస్‌ పరిష్కరించుకుందని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. దీంతో కూటమి సమావేశంలో అఖిలేశ్‌ పాల్గొనే అవకాశం ఉంది. టీఎంసీ అధినేత్రి మమత ఈనెల 17-19మధ్యలో ఢిల్లీలో ఉండనున్నారు. దాంతో ఆమె కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.