Read News in Telugu Language
adsdaksha

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మనవడికి కాస్లీ గిఫ్ట్.. అత్యంత పిన్న వయసులోనే ఆస్తి రూ.240 కోట్లు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 19

ఆ పసిబాబు వయస్సు కేవలం 4 నెలలు.. కానీ అతడి ఆస్తి ఏకంగా రూ.240 కోట్లు.. పైగా ఇండియాలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్ల జాబితాలో ఆ చిన్నారి చోటు దక్కించుకోవడం గమనార్హం. అదేంటి అనుకుంటున్నారా..? నిజమే మరీ. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ( infosys narayana murthy ) మీ తాత అయితే.. మీరు ఆ జాబితాలో చేరిపోవొచ్చు.

read also : ప్రజావాణికి తాత్కాలిక బ్రేక్‌.. జూన్‌ 7 నుంచి పున: ప్రారంభం..

Hospital

అసలు విషయం ఏమిటంటే.. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి ( ekagrah rohan murty ) కి అత్యంత కాస్ల్టీ గిఫ్ట్ ఇచ్చారు. తన కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ ( infosys ) లో 15 లక్షల షేర్లను అతడి(తన మనువడి) పేరు మీద రిజిష్టర్ చేసేశారు. ఈ షేర్ల వ్యాల్యూ అక్షరాల రూ.240 కోట్లు ఉంటుంది.

read also : dell : వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు షాక్ .. ప్రముఖ కంపెనీ డెల్ నోటీసు..

నిజానికి నారాయణమూర్తికి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటా ఉంది. అంటే ఆయన వద్ద 1.51 కోట్ల కంపెనీ షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల నుంచి కొన్నింటినీ మనవడికి బహుమతిగా ఇచ్చినట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించారు. తన తాత ఇచ్చిన ఖరీదైన బహుమతితో ఏకాగ్రహ్‌కు ఇన్ఫోసిస్‌లో 0.04 శాతం వాటా లభించినట్టయ్యింది. ఇదిలావుంటే.. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమారుడైన రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్‌లకు ఏకాగ్రహ్ గతేడాది నవంబరులో జన్మించిన సంగతి తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.