Read News in Telugu Language
adsdaksha

విలేజ్ ఇన్నోవేషన్ కు అవార్డుకు ఎంపికైన మండల రైతు..

దక్ష న్యూస్, పినపాక : జనవరి 27

– ముల్లపూడి సత్యనారాయణ ను సన్మానించిన ప్రజా ప్రతినిధులు

ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్
అవార్డ్ – 2024 ను పినపాక మండలం జానంపేట కు చెందిన ముళ్ళపూడి సత్యనారాయణ అనే రైతు అందుకున్నారు. ఈ అవార్డు తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్ స్ఫూర్తితో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో అందిస్తూ ఉండగా పినపాక మండలానికి ఈ అవార్డు వరించింది.

Hospital

Read also: భూ బాధితులకు న్యాయం చేయడమే గద్దరన్నకు నిజమైన నివాళి : డిప్యూటీ సీఎం భట్టి

జానంపేట గ్రామ పంచాయితీ పరిధిలో రైతుకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణ కు గుర్తింపు దక్కింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనంపేట పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సెక్రెటరీ నాగిని ప్రభుత్వం అందించిన ఈ అవార్డును రైతుకు ప్రదానోత్సవం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో రైతును సన్మానించారు . ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ కామేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది నరసింహారావు, జానంపేట ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, రామచందర్ రాజు, మురళి, పేరం వెంకటే శ్వర్లు , రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.