Read News in Telugu Language
adsdaksha

13 నుండి అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 2

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ జనవరి 13 వ తేది నుండి 15 వరకు అంతర్జాతీయ స్థాయి పతంగుల, స్వీట్ ఫెస్టివల్ (International Kite and Sweet festival) నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం, సాంస్కృతిక శాఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ( sailaja ramayyar ) తెలిపారు.

read also : టీమ్ ఇండియా 2024 షెడ్యూల్ ఇదే..

Hospital

హైదరాబాద్ ( hyderabad ) లోని హిమాయత్ నగర్ ( himayat nagar ) లోని తెలంగాణ ( telangana ) టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ( tourism development corporation ) కార్యాలయం లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశం లో అంతర్జాతీయ స్థాయి పతంగుల, స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లను సమీక్షించారు. అంతర్జాతీయ స్థాయి పతంగుల, స్వీట్ ఫెస్టివల్ పాల్గొను వారికి సందర్శించే వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సౌకర్యం, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు.

read also : ప్రజల చెంతకే ప్రభుత్వ పథకాలు..మీరిచ్చే ప్రతి దరఖాస్తు కంప్యూటరైజ్ చేస్తాం…

ఈ సంధర్భంగా 3 రోజుల పాటు నిరంతరంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని శైలజ రామయ్యర్ రాష్ట్ర భాష, సాంస్కృతిక సంచాలకులు హరికృష్ణ ను కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్రీ కర్ణన్, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ. మామిడి హరిక్రిష్ణ, టూరిజం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ మహేష్, సంబంధిత అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.