Read News in Telugu Language
adsdaksha

భావోద్వేగం తోనే మంచి ఫోటోలు.. ఎం.పి సంతోష్ కుమార్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఆగస్ట్ 17

ఫోటో గ్రఫీ అంటే సజీవ కళ అని, భావోద్వేగం, ఫోటో సెన్స్ ఉంటే ఉంటే తప్ప మంచి ఫోటోను తీయలేమని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ( m.p. joginipalli santhosh kumar ) అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం (international photography day ) సందర్భంగా గురువారం రవీంద్రభారతి ( raveendrabharathi) లో ఫోటో జర్నలిస్టు ( photo journalist ) అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ( allam narayana ) , ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ( mla kranthi kiran ), సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఫోటో జర్నలిస్టులకోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, అందుకోసం తన ఎం.పి నిధుల నుంచి రూ.2 లక్షలను అందజేయనున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. ఒక మంచి ఫోటో వంద వార్త కథనాలతో సమానం అన్నారు.

read also : పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ స్వప్నిక రేహ పౌండేషన్ అధ్వర్యంలో అవగాహన సదస్సు..

Hospital

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో టిపి జెఎ అధ్యక్షుడు భాస్కర్ ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ గ్రామీణ సౌందర్యన్ని వివరించే విధంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఉందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు. ఈ ప్రదర్శనలో ఉంచిన ఉత్తమ ఫోటోలను ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రకటిస్తామని చెప్పారు.

read also : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు కన్ను మూత..

ఈ కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ 216 ఎంట్రీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రమణ కుమార్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సర్వేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి దుబ్బాక సురేష్ రెడ్డి, సభ్యులు కృష్ణ, లాయక్, కూంట్ల శ్రీనివాస్, శ్రీధర్, బి సి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.