Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ గ్రామీణ పర్యాటకానికి కేంద్ర పర్యాటక శాఖ అవార్డులు..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 27

ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా తెలంగాణ లో పెంబర్తి, చంద్లా పూర్..

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ( cm kcr ) మార్గదర్శకత్వం లో పర్యాటక రంగ అభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రోత్సాహం అందించడం వల్లే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయన్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ( v. srinivas gaud ) అన్నారు. తెలంగాణ ( telangana ) రాష్ట్రం లో ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా పెంబర్తి ( pembarthi ), చంద్లా పూర్ ( chandlapur ) ఎంపికయ్యాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం ( international tourism day ) సందర్భంగా బుధవారం న్యూ ఢిల్లీ ( new delhi ) లో కేంద్ర పర్యాటక శాఖ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా ఎంపికైన పెంబర్తి, చంద్లా పూర్ లకు గాను అందించిన రెండు అవార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ ( sailaja ramayyar ) అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పర్యాటకానికి అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ మార్గ నిర్దేశం వల్లే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు లు వస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సాదించిన అవార్డు లను ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందుకున్నపర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యార్ కు మంత్రి అభినందనలు తెలియజేశారు.

Hospital

read also : పీవీ మార్గ్ లో లేక్ ఫ్రంట్ పార్క్ ..

అనంతంరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం లో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికైన జనగామ జిల్లా లోని హస్త కళలకు ప్రసిధ్ధి చెందిన పెంబర్తి, సిద్దిపేట జిల్లా లోని గొల్ల బామ చీరల కేంద్రం తో పాటు రంగనాయక కొండలను, ప్రకృతి రమణీయ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న చంద్లా పూర్ గ్రామాలను కేంద్ర పర్యాటక శాఖ జాతీయ స్థాయిలో గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా ఎంపికచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

read also : కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి ..

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా అన్ని రిజర్వాయర్లలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పర్యాటక రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్దు లను గెలుచుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.