Read News in Telugu Language
adsdaksha

vaish : సంపాదనలోనే కాదు ఆర్య‌వైశ్యులు సేవ‌ల్లోను ముందే..

ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్ ఆద్వర్యంలో పేద‌ మహిళలకు కుట్టు మిష‌న్ల పంపిణీ..

ఆర్య‌వైశ్యులు సంపాద‌న‌లోనే గాక‌, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటారని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ( errabelli dayakar rao ) అన్నారు. ఆదివారం ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్ ( international vaisya federation ) జ‌న‌గామ జిల్లా (janagama district ) శాఖ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, గ‌తంలో వ్యాపారాల‌కే ప‌రిమిత‌మైన ఆర్య‌వైశ్యులు ఇవ్వాళ సామాజిక సేవా, రాజ‌కీయ రంగాల్లోనూ రాణిస్తున్నార‌ని అన్నారు. వారి పిల్లలు చ‌దువుల్లోనూ ముందుంటుంన్నారన్నారు. త‌న‌కు ఆర్య‌వైశ్యుల‌తో ఎన్నో ఏండ్లుగా అనుబంధం ఉంద‌న్నారు.

Hospital

read also ; చిందేసిన మంత్రి .. భోనమెత్తి మహిళలతో నృత్యాలు..

ఆర్యవైశ్యులు మ‌రింత సేవ చేసి, నిరుపేద‌లుగా ఉన్న ఆర్య‌వైశ్యుల‌తోపాటు, స‌మాజంలోని ఇత‌ర పేద‌ల‌నుకూడా ఆదుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు. కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన కార్య‌వ‌ర్గానికి మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆర్య‌వైశ్యుల్లో నిరుపేద‌ల‌కు ఈ సందర్భంగా కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేశారు. నూత‌న కార్య‌వ‌ర్గాన్ని మంత్రి స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షులు ఉప్ప‌ల శ్రీ‌నివాస్‌ గుప్త‌, బిజ్జాల న‌వీన్‌, ఉపేంద‌ర్‌, రాపాక విజ‌య్‌, ఆర్య‌వైశ్య ప్ర‌ముఖులు, నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులు, వివిధ మండ‌లాల కార్య‌వ‌ర్గాల బాధ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.