Read News in Telugu Language
adsdaksha

బోణికొట్టిన ముంబయి.. 29 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 7

ఐపీఎల్-17 సీజన్‌లో ముంబై ఖాతా తెరిచింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. స్టబ్స్ (71*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) పోరాటం ఫలించలేదు. ఓపెనర్ పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు. 3 సిక్సర్లు), అభిషేక్ పోరెల్ (41; 31 బంతుల్లో 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కోయెట్టి 4 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, షెపర్డ్ 2 వికెట్లు తీశారు.

Read also: బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్‌ .. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరిక..

స్టబ్స్ మెరుపులు :
క్రీజులోకి రాగానే ట్రిస్టన్ స్టబ్స్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 13 ఓవర్లలో పీయూష్ చావ్లా రెండు సిక్సర్లు బాదాడు. ఆకాష్ 17 ఓవర్లలో వరుసగా 4, 6, 4 బౌలింగ్ చేసి 19 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు.

Hospital

రొమారియో షెపర్డ్ 19 ఓవర్లలో మూడు సిక్సర్లు బాదాడు.
అంతకుముందు టాస్ ఓడిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (45*; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. హార్దిక్ పాండ్యా (39: 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) రాణించాడు. రొమారియో షెపర్డ్ (39*, 10 బంతుల్లో) చివరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 32 పరుగులు చేశాడు.

Read also: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్..

ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, నోకియా 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.

Leave A Reply

Your email address will not be published.